ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలక్షన్స్ నాలుగు మాసాలు అయినప్పటికీ రాజకీయ వేడి ఇంకా చల్లారట్లేదు .దానికి ప్రముఖ కారణం వై . యస్ షర్మిల. షర్మిల తన అన్నగారు అయినటువంటి మాజీ సీఎం తో సాగిస్తున్న ఒంటరి ఆస్థి పోరాటమే అని చెప్పవచ్చు . ఈ కారణం గానే వారం క్రితం బెంగుళూరు లో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో జరిగిన సంధి చర్చలు విఫలమైనట్లు సమాచారం .
ఆస్తులను ఇచ్చినట్లే ఇచ్చి , నమ్మించి ప్రతీ సారి మోసం చేస్తున్నారు అన్నది కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల గారి బాధ . ఒకవేళ ఆస్తులను సక్రమంగా ఇచ్చినట్లయితే అన్నగారి బాటలో నడవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ జగన్ పరివారం అందుకు సిద్ధంగా లేకపోవడం తో షర్మిల ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్టు బోగట్టా . అది ముందే పసిగట్టిన ప్యాలెస్ వర్గాలు షర్మిళ పైన కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు .
జగన్ ఈ విషయంలో పట్టు విడుపుతో ఉన్నప్పటికీ అయన ఆంతరంగిక బంధువులు అందుకు ససేమీరా అనడం తో వివాదం ముదురుతోంది . ఈ విషయంలో వై యస్సార్ సతీమణి విజయమ్మ గారి మాటని కూడా ఎవ్వరూ లెక్క
చేయకపోవడం గమనార్హం .
విశ్వసనీయత , విలువలు అంటూ పాస్టర్ ప్రవచనాలు చెప్పే జగన్ అదే విలువలు తన కుటుంబంలో కూడా పాటిస్తే తాను ప్రజల్లో విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండగలడని , లేదంటే రాబోయే కాలంలో షర్మిళ ప్రతిపక్షనేత పదవిని కూడా లాగేసుకుంటుందని కూటమి నేతలు చెబుతుండడం కొసమెరుపు .
ఏమో ..రాజకీయాల్లో ఏమైనా జరవచ్చు .