Tuesday, March 18, 2025
HomeHealthఆశ , నిరాశల మధ్యలో మందుబాబులు . నాణ్యతే ప్రాతిపదిక మందు రేట్లు

ఆశ , నిరాశల మధ్యలో మందుబాబులు . నాణ్యతే ప్రాతిపదిక మందు రేట్లు

ఆంధ్రప్రదేశ్ లో ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది . కానీ ఆశించిన స్థాయిలో మందు ధరలు లేకపోవడంతో మద్యం ప్రియులు నిరాశ చెందారని చెప్పవచ్చు .ఒక విధంగా 90 రూపాయలకే నాణ్యమైన మద్యం అని ఊరిస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం మందుబాబులని ఊరించి ఉసూరుమనిపించినట్లయింది . దీనికి తోడు ఒక సామాజిక వర్గ మీడియా అంత తక్కువ , ఇంత తక్కువ అని ఊరిస్తూ అనేక ఊహాగానాల వార్తలను వండివార్చడంతో సగటు మధ్య జీవి ఏ రోజుకోసం ఏంటో ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ ధరల విషయంలో నిరాశ చెందాడని చెప్పకతప్పదు .

ధరల విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ నాణ్యమైన మద్యం దొరుకుతుండడంతో కొంతమంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .
కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించింది. ఈ తాజా మార్పుతో షాపుల్లో నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది .

కొత్త మద్యం ధరలు:

  1. విస్కీ:
    • రాయల్ ఛాలెంజర్స్ క్వార్టర్: రూ. 230
    • 8 PM క్వార్టర్: రూ. 230
    • ఆఫీసర్స్ ఛాయిస్ క్వార్టర్: రూ. 150
    • Mc Dowell’s No 1 క్వార్టర్: రూ. 180
    • హార్సెస్ సెలెక్టెడ్ విస్కీ 180 ఎం.ఎల్: రూ. 130
    • హార్సెస్ సెలెక్టెడ్ 750 ఎం.ఎల్: రూ. 750
    • నేవీ బ్లూ క్లాసిక్ 180 ఎం.ఎల్: రూ. 150
    • ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ 750 ఎం.ఎల్: రూ. 490

బ్రాండీ:

  • మాన్సిన్ హౌస్ క్వార్టర్: రూ. 240
  • కైరోన్ రేర్ 180 ఎం.ఎల్: రూ. 300
  • నెపోలియన్ సెయింట్ 750 ఎం.ఎల్: రూ. 1180

వోడ్కా:

  • మ్యాజిక్ మూమెంట్స్ క్వార్టర్: రూ. 230
  • ఓల్డ్ మంక్ రమ్ము క్వార్టర్: రూ. 230

బీర్:

  • కింగ్ ఫిషర్ Splendid స్ట్రాంగ్: రూ. 200
  • కింగ్ ఫిషర్ స్ట్రోమ్ రీగల్: రూ. 220

రమ్:

  • ఓల్డ్ మంక్ స్పెషల్ XXX రేర్ 180 ఎం.ఎల్: రూ. 230

కొత్త మద్యం ధరలు రాష్ట్ర వ్యాప్తంగా లభ్యమవుతున్నాయి. షాపుల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియ కూడా లాటరీ ద్వారా జరిగింది. బుధవారం నుండి ఈ కొత్త షాపులు ప్రారంభమయ్యాయి. బ్రాండ్ల ప్రకారం ధరలు మారవచ్చు, అయితే అందుబాటులో ఉన్న నాణ్యమైన మద్యం పట్ల ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది.

RELATED ARTICLES

1 COMMENT

Comments are closed.

Most Popular

Recent Comments