వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శర్మిల మధ్య ఆస్తుల వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు, తన ఆస్తులను తన పిల్లలకి సమంగా పంచాలని అనుకున్నారని , అది ఆయన అభిమతమని షర్మిల వాదిస్తున్నారు . ఇది ఎంతవరకు నిజమో తెలియనప్పటికీ శర్మిల తనకూ వాటా వస్తుందనే గట్టి ఆశతో అయితే ఉంది.
జగన్ సీఎం అయిన తర్వాత, విజయమ్మ, శర్మిల పేర్లతో ఆస్తికి సంబందించిన ఒప్పందం కూడా కుదిరింది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్తుల పంపకాల విషయంలో అసలు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. శర్మిల తనదైన స్టైల్లో, “ఎవరికీ ఒప్పందాలు అవసరం లేదమ్మా, ఇప్పటికే ఉన్న ఒప్పందాలను చించి పడేయ్, నాకు నా వాటా డబ్బుగా ఇస్తే సరిపోతుంది” అంటూ తన అన్నయ్యతో యద్ధానికి సిద్దమయ్యింది . అసలే ఓటమి భారంతో కుంగిపోతున్న జగన్ కి ఇది పెద్ద ఎదురు దెబ్బ .
అంతే కాకుండా శర్మిల తన వాటా కింద ఏకంగా రూ. 10,000 కోట్ల డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, జగన్ ఈ డిమాండ్‌ని నిరాకరించడంతో పాటు ఆస్తుల పంపకానికి సుముఖంగా లేకపోవడంతో షర్మిల మండి పడుతున్నట్లు సమాచారం . ఆస్తుల విషయంలో తప్పుడు కారణాలతో తనని మోసం చేస్తున్నారని, జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని శర్మిల ఆరోపించడం గమనార్హం .
ఈ విషయంలో వైఎస్ విజయమ్మ కూడా తన కూతురు శర్మిలకి రూ. 10,000 కోట్లను ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు పలికింది. ఈ పరిణామం కుటుంబం రెండుగా చీలడానికి కారణం అయ్యిందని చెప్పవచ్చు .– ఒకవైపు విజయమ్మ, శర్మిల ఉండగా, మరోవైపు జగన్ ఒంటరిగా (? )నిలిచాడు. ఈ వివాదం వల్ల జగన్, తన చెల్లి శర్మిల మధ్య విబేధాలు పెరిగి, శర్మిల తో పాటు జగన్ రాజకీయ ప్రస్థానంపై తీవ్ర ప్రభావం చూపించనుంది .
జగన్ తన డిమాండ్‌ను నెరవేర్చకపోవడంతో, శర్మిల తన అన్నకి వ్యతిరేకంగా రాజకీయంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు చెబుతున్నదానికి ప్రకారం, రూ. 10,000 కోట్లు ఆమెకు ఇవ్వబడితే, శర్మిల తన అన్నకి వ్యతిరేకంగా రాజకీయ రంగప్రవేశం చేసేందుకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఈ ఆస్తి వివాదం చివరకు వైఎస్సార్ కుటుంబ పేరుని సైతం చెడగొట్టేలా చేసిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.