ప్రపంచమంతా ఏంటో ఆసక్తి గా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికల ఫలితం ఏకపక్షంగా వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి .కమలా హారిస్ గట్టి పోటీని ఇచ్చినప్పటికీ ట్రంప్ సునామీ ముందు ఎదురునిలవలేకపోయారు .దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధిపత్యం సన్నగిల్లుతున్నదన్నా వాదన ని డెమొక్రాట్లు నమ్మడం .అంతేకాకుండా విదేశీ వలసదారులు కూడా ట్రంప్ ని నమ్మడం ఒక కారణంగా చెప్పవచ్చు .
మరీ ముఖ్యంగా అధిక శాతం భారతీయులు డెమొక్రాట్లకు , కమలా హారిస్ మద్దతు దారులైనప్పటికీ వారి మద్దతును ఓట్లగా మలచలేకపోవడం కచ్చితంగా కమలహరిస్ చేతకానితనం అని చెప్పవచ్చు . ట్రంప్ ని ద్వేషించే చాలామంది అమెరికన్లు మాత్రం ట్రంప్ ఆర్థిక విధానాలను నమ్మడం , ఇప్పుడున్న అనిశ్చితిని తగ్గించి తన సమర్థ నాయకత్వంతో అమెరికాని ముందుకు తీసుకెళ్లగలడని విశ్వసిస్తున్నారు .డోనాల్డ్ ట్రంప్ వస్తే ఏమైతుందో అని కొన్ని ప్రపంచ దేశాలు భయపడుతున్నప్పటికీ ఆర్థిక తిరోగమనం మల్లి గాడిన పడాలంటే రిపబ్లికన్ వంటి పెట్టుబడిదారి ప్రభుత్వం వుంది తీరాల్సిందే అని మెజార్టీ దేశాలు కోరుకుంటున్నాయి .సగటు అమెరికన్ ల ఆలోచనలు అదే కావడంతో ట్రంప్ తన అధ్యక్ష పీఠాన్ని భారీ మెజార్టీతో సాధించుకోనున్నారు .
కానీ తుది 2024 అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా తేలవు . పెద్ద రాష్ట్రాలు అయిన పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా వంటి రాష్ట్రాలలో క్లిష్టమైన పోటీ ఉన్నందువల్ల గెలుపు ఇంకా ఖరారు కాలేదు. ఈ ఫలితాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఎన్నికల ఫైనల్ ఫలితం తేల్చేందుకు ఈ కీలక ప్రాంతాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.