రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఇటువంటి సమయంలో టీడీపీకి చెందిన ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణం రాజు తాజాగా డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా, తన మొదటి ప్రసంగంలోనే రాష్ట్ర బడ్జెట్ పై ఆందోళనను వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిదారుణంగా , భయంకరంగా ఉందని వ్యాఖ్యానించారు.
రఘురామ, ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ లకు తీవ్ర కష్టకాలం ఎదురవుతోందని స్పష్టం చేశారు. బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలు సాధ్యం అవుతాయా లేదా అన్నది ప్రశ్నార్ధకం అవుతోందంటూ సెలవిచ్చారు.
ఆర్థిక పరంగా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తులో కూడా మళ్ళీ గాడిన పడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు. అప్పులు, సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి బాధ్యత అవసరమని సూచించారు.
సంక్షేమ ప్రాజెక్టులపైనా, అభివృద్ధి ప్రణాళికలపైనా ఒకేసారి ద్రుష్టి సారించి రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆచి తూచి అడుగువేయవలసి వస్తుందని ప్రజలు సహ్రదయంతో సహకరించాలని కోరారు మన రాజాధి రాజా త్రిబుల్ ఆర్ ఆర్ ఆర్ గారు .