ఉపవాసం అంటే ఆహారం తీసుకోవడం తగ్గించడం లేదా ఆపడం. అనేక సంస్కృతులలో ఇది ఆధ్యాత్మిక వైద్యం లేదా శుభ్రపరిచే కారణాల కోసం ఒక ఆచారం ఆచరిస్తారు. కానీ కొంతమంది ఉపవాస సమయంలో కొన్ని పండ్లు తింటారు. అయితే, ఉపవాస సమయంలో కొన్ని పండ్లకు దూరంగా ఉండాలి.
అలాగే ఉపవాస సమయంలో తినకూడని పండ్లులో చక్కెర అధికంగా ఉండే పండ్లు (ద్రాక్ష, అత్తి పండ్లను, కివి) రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది ఉపవాసం చేసేటపుడు ఇవి తినకూడదు. నిమ్మ, నారింజ వంటి పండ్లు చాలా పుల్లగా ఉంటాయి. ఇది కడుపు పూతల లేదా ఇతర సమస్యలతో బాధపడే వ్యక్తులు ఉపవాస సమయంలో తీసుకోకూడదు. యాపిల్ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఇవి కూడా తీసుకోకూడదు.
ఉపవాసంలో బెర్రీలు (స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్), దానిమ్మ మరియు అరటిపండ్లు వంటి పండ్లలో ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు వంటి పండ్లలో ఫైబర్ తక్కువగా ఉంటుంది కాదట్టి ఇవి తీసుకోవచ్చు. ఉపవాసం చేసేటప్పుడు నీరు, కొబ్బరి నీరు లేదా వెచ్చని నీటిలో తేనె వంటి ద్రవాలను త్రాగవచ్చు.