Thursday, November 21, 2024
HomeHealthకళ్ళ కింద నల్లటి వలయాలు మిమ్మల్ని బాధిస్తున్నాయా....?

కళ్ళ కింద నల్లటి వలయాలు మిమ్మల్ని బాధిస్తున్నాయా….?

నల్లటి వలయాలు ఉంటే, మీరు పడుకునే ముందు బాదం నూనెను ఉపయోగించవచ్చు. మీ కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నచోట మూడు చుక్కలు వేసి మొత్తం వృద్ధి రాత్రంతా ఉంచండి. ఉదయం కడిగేయండి. బాదం నూనె మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి సున్నితంగా ఉంచుతుంది.

నల్లటి మచ్చలను తాగించడానికి మరొక పద్దతిలో దోసకాయను ముక్కలు చేసి, ఆ ముక్కలను మీ మూసిన కళ్లపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి. దోసకాయ చల్లదనం మీ కళ్ళకు విశ్రాంతినిస్తుంది. మరియు ఉబ్బడం మరియు నల్లటి వలయాలను తగ్గిస్తుంది. కాబట్టి, నల్లటి వలయాలను పోగొట్టడానికి చాలా ముఖ్యమైన మరియు సులభమైన మార్గాలు ఉన్నాయి.

మీరు పైనాపిల్ రసంలో కొద్దిగా పసుపు కూడా కలిపి పేస్ కి అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వండి. పసుపు మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. అదే కాకుండా టొమాటోరసాన్ని, నిమ్మరసంతో కలిపి, కాటన్ క్లాత్ తో మీ కళ్ల కింద రుద్దాలి. ఇది సుమారు 15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

https://telugutarang.com/benefits-of-sethapal/

టొమాటో రసాంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నల్లటి వలయాలను తేలికగా తగిస్తాయి. అలాగే పుదీనా ఆకులతో తయారు చేసిన పేస్ట్‌ను కూడా వాడొచ్చు. రోజ్ వాటర్‌లో కాటన్ బట్టని నానబెట్టి, దానిని కళ్లపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచడం కూడా మంచిది. రోజ్ వాటర్ మీ చర్మానికి మంచిది. ఈ నల్లటి వలయాలు ఎందుకు వస్తాయాంటే సరిగ్గా నిద్రపోకపోతే వస్తాయి. అయితే మీరు ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కలబంద గుజ్జును మీ కళ్ల కింద అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేసి, 10 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments