Wednesday, February 5, 2025
HomePoliticsఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర .. సపోర్ట్ గా రంగంలోకి జగన్

ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర .. సపోర్ట్ గా రంగంలోకి జగన్

తెలుగు సినిమా నంబర్ వన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు, ఈసారి పుష్ప కలెక్షన్లతో కాదు కానీ ఆయన అరెస్టుతో. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో కోసం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వెళ్లినప్పుడు, అభిమానుల తొక్కిసలాటలో ఒక నిండుప్రాణం బలి అవ్వడం సంచలనం సృష్టించింది.ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షోకు చేరుకోగా, అక్కడ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి భారీగా తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో ఒక బాబుకు తీవ్ర గాయాలయ్యాయి.బాబు తల్లి ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన నేపథ్యంలో, అల్లు అర్జున్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఆయనతో పాటు, థియేటర్ యాజమాన్యం మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అల్లు అర్జున్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని తన నివాసంలో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల అదుపులో అల్లూ అర్జున్:

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హీరో అల్లు అర్జున్ ని భారీ భద్రత మధ్య ఉంచారు.ఈ విషయంపైన ఆయన తరపున లాయర్ నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని కోరారు. అలాగే హైకోర్టులో అర్జున్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది.ఒకవేళ ఏమైనా పొరబాటు జరిగితే అల్లు అర్జున్ జైలు పాలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది .

దుర్ఘటన కి మూలకారణం ఎవరు ?

ప్రస్తుతం ఈ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లూ లేకుండా పుష్ప 2 ప్రీమియర్ షో కి హజరు అయినప్పుడు అక్కడని పరిస్థితి ఎలా ఊహించలేని స్థాయికి చేరుకుంది అనే దానిపై వివిధ కోణాలలో చర్చలు జరుగుతున్నాయి. థియేటర్ యాజమాన్యం ఏర్పాట్లు సరిపోకపోవడం, అలాగే అభిమానుల అత్యుత్సహం ఎవరూ ఊహించలేకపోయారు.

ప్రభుత్వం అనుమతి లేకుండా తారల్ని అభిమానులతో కలిపి ప్రేక్షకులకి ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ఏంత వరకూ సురక్షితమని ప్రశ్నించే బాధ్యత కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది . అంతేకాకుండా ఏ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంటుందన్న సందేహం , అల్లు అర్జున్ ఎదుగుదల చూడలేని ఓర్వలేని నాయకుల కుట్రలు కూడా ఉండవచ్చన్న అనుమానాలు, అనూహ్య రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వస్తున్నాయి.

నిరంజన్ రెడ్డి & వైసీపీ కూటమి పాత్ర ఏంటంటే ?

నిరంజన్ రెడ్డి ఏపీ లోని ప్రతిపక్ష కూటమి కి సంబందించిన ఒక అద్భుతమైన లాయర్ అని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే .గతంలో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్షాల నుంచి ఎదురొడ్డి, అనేక అంశాలలో వాదనలు వినిపించారు . ఆయన తరఫున ఈ పిటిషన్ దాఖలు చేయడంపై కొత్త రాజకీయాలు ప్రారంభమవుతాయని ప్రచారం కూడా మొదలయ్యింది .

RELATED ARTICLES

Most Popular

Recent Comments