కొన్నిసార్లు, మనం ఎక్కువగా ఆడినప్పుడు లేదా ఎక్కువగా కదలనప్పుడు మనకి కీళ్ళు నొప్పులు వస్తాయి. ఈ నొప్పి బలమైన నొప్పి, లేదా మండుతున్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది త్వరగా తగిపోతుంది. కానీ కొన్ని సమయాల్లో ఇది చాలా కాలం పాటు ఉంటుంది. దీనినే దీర్ఘకాలిక నొప్పి అంటారు. నొప్పి చాలా రోజులు కొనసాగితే, ప్రత్యేకించి మీకు జ్వరం లేదా అలసిపోయినట్లు అనిపిస్తే, వైద్యుడికి చూపించాలి.
కీళ్ల నొప్పులు రావడానికి కారణం గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా కొన్ని వ్యాధుల వల్ల కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. మీ మోకాళ్లు, మోచేతులు, వంటి మీ ఎముకలు కనెక్ట్ అయ్యే ప్రదేశాలలో మీకు నొప్పులుగా ఉంటే వాటిని కీళ్ల నొపూలు అంటారు. కీళ్ళు మన ఎముకలు సులభంగా కదలడానికి సహాయపడతాయి. అవి మృదులాస్థి, స్నాయువులు మరియు సజావుగా పనిచేయడానికి సహాయపడే ప్రత్యేకద్రవం వంటి వివిధ భాగాలతో రూపొందించబడ్డాయి. అవి తగ్గినప్పుడు లేదా అరిగినపుడు నొప్పులు అనేవి వస్తాయి.