పెదాలను రక్షించడంలో దానిమ్మ గింజల నూనె కూడా చాలా మంచిది. ఇది ఒక టీస్పూన్ తేనెతో కొన్ని చుక్కల దానిమ్మ గింజల నూనెను వేసి కలిపి దానిని మీ పెదవులపై రూది 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత కడిగేయాలి.

మీ పెదాలు పొడిగా లేదా పగిలినాటు ఉంటే వాటిని అందంగా కనిపించేలా ఇవి చేస్తాయి. అందులో కలబంద కూడా అద్భుతమైనది. మీరు తాజా అలోవెరా జెల్‌తో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను వేసి మిక్స్ చేసి పెదాలకి అప్లై చేయాలి. రోజు ఇలా చేయడం వాల్ల పెదవులను మెరిసేలా మరియు కాంతివంతంగా మార్చే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అందుతాయి.

లిప్ మాస్కులు కూడా మంచివి అవి చేయడానికి, తాజా గులాబీ రేకులను చూర్ణం చేసి, వాటిని మిల్క్ క్రీమ్ మరియు తేనెతో కలిపి, మీ పెదాలకు 15 నుండి 20 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై పాలు మరియు నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలాగే బీట్‌రూట్ మీ పెదవులకు చక్కని ఎరుపు రంగును ఇవ్వడంలో అద్భుతమైనది. ఇది నల్లటి చర్మాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. మీరు బీట్‌రూట్‌ను తురుముకుని, దాని రసాన్ని తీసుకుని, కొంచెం తేనెతో కలిపి, రాత్రిపూట మీ పెదాలకు రాసుకోన్ని తర్వాత ఉదయాన్నే కడిగేయాలి. ఈ సాధారణ పదార్ధాలతో మీ పెదాలను జాగ్రత్తగా చేసుకోవడం వల్ల వాటిని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచడంలో సహాయపడుతాయి.

కానీ ఈ సమస్యలను దాచుకోవడానికి చాలా మంది లిప్ బామ్‌లు వాడుతుంటారు. మన కళ్ళు మరియు పెదవులు మన ముఖంలో చాలా ముఖ్యమైన భాగాలు, కాబట్టి మన చర్మం మెరుస్తూ ఉండటానికి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈ సమస్యలను పరిష్కరించడంలో ఇవి సహాయపడుతాయి.