Friday, January 17, 2025
HomeHealthతిరుమలలో ఏం జరిగిందో తెలుసా…

తిరుమలలో ఏం జరిగిందో తెలుసా…

తిరుమలలో ఏం జరిగిందో తెలుసా…ఈ రోజు ఉదయం తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అందువలన భక్తులను అధికారులు సురక్షతంగా ఉంచుతున్నారు. కానీ కొన్ని పెద్ద రాళ్లు రోడ్డుపై పడ్డాయి, అయితే ట్రాఫిక్ లేకుండా వాటిని అధికారులు జీసిపీ సాయంతో తొలగించారు.

ఈ వర్షాలు వల్ల ముఖ్యంగా రాయలసీమ మరియు నెల్లూరులో వర్షలు ఎక్కువగా కురుస్తున్నాయి. కొన్ని చోట్ల చాలా నీరు నిలబడిపోతున్నాయి. అత్యధికంగా, జలదంకి అనే ప్రాంతంలో 40 సెంటీమీటర్లు నమోదు చేసేరు. కావలిలో 33.9, కందుకూరిపేటలో 23, గూడూరులో 20.5 సెంటీమీటర్ల నమోదుచేయటం జరిగిది. వరికుంటపాడు మండలం కానియంపాడులో పిల్లపెరువాగు ఉధృతి పెరిగింది.

కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారంలో మిడతవాగులో వరద ఉధృతి పెరుగుతుంది. వర్షాల కారణంగా తిరుమలలో విఐపి దర్శనాలు నిలిపివేసేరు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారింది. వాయవ్య దిశగా 10 కిలో మీటర్లు వేగంతో కదులుతున్నట్లు గమనించరు. కొన్ని ప్రాంతాల్లో నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments