Wednesday, February 12, 2025
HomeHealthజుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని అనుకుంటున్నారా...?

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని అనుకుంటున్నారా…?

షాంపూలు ఉపయోగించే బదులు, మన జుట్టుకు కొన్ని సహజ సిద్ధమైన చిట్కాల తో చేయవచ్చు.మన వంటింట్లో దొరికే కాఫీ పొడి జుట్టుకు చాలా మంచిది. మీరు కాస్త కాఫీ పౌడర్‌ని గోరువెచ్చని నీటిలో కరిగించి తలకి అప్లై చేసుకోవాలి అరగంట పాటు ఉంచి కడిగేయాలి. కాఫీ పౌడర్‌లో విటమిన్ ఇ ఉంటుంది. అందువల్ల మీ జుట్టు ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది.

మరో చక్కని ఉపాయం తమలపాకులను ఉపయోగించడం. అవి మీ జుట్టు అందంగా పెరగడానికి సహాయపడతాయి. మీరు కొన్ని తమలపాకులను నీటితో కడిగి నెయ్యి మరియు తేనెలో కలిపి జుట్టు మీద పెట్టి ఉంచాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.

కలబంద జుట్టుకు చాలా మంచిది. మీరు కలబంద గుజ్జును తలకు రాసుకొని ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. పొడి చర్మం మరియు చుండ్రుకి సహాయపడుతుంది. మీ జుట్టును బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఉల్లిపాయ జుట్టును బలంగా ఉండేలా చేస్తుంది. మీరు ఒక ఉల్లిపాయను మిక్స్ చేసి, ఆ రసాన్ని మీ తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఉల్లిపాయలో సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. అది మీ జుట్టు వేగంగా పెరగడానికి మరియు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది. ఇలా చేయండి మీరు కోల్పోయిన జుట్టు తిరిగి వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments