Tuesday, March 18, 2025
HomeHealthఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా...

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా…

సాయి పల్లవి తమిళనాడులోని ఊటీ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె దక్షిణాదిన ప్రముఖ నటిగా పేరు వచ్చింది. ఆమె మొదటి సినిమా ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా సినిమాలో డ్యాన్స్ అందరిని ఫిదా చేసింది. నిజానికి సాయి పల్లవి హీరోల ఫార్మాట్‌ని మార్చేసిందని చెప్పొచ్చు. ఆమెకు కథ నచ్చితే సంతకం చేస్తుంది.

సాయి పల్లవి తన అభిమానులకు ఎప్పుడూ లేడీ పవర్ స్టార్ లా కనిపిస్తుంది. ఆమె తన డ్యాన్స్, నటన మరియు ప్రవర్తనతో తెలుగు ప్రేక్షకుల అనసులో నిలిచిపోయింది. ఆమె చాలా బాగా నాట్యం చేస్తుంది. అలాగే డ్యాన్స్ చూడటానికే థియేటర్‌కి వచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఫిదా సినిమాలోని వచ్చిండే పాట అయినా, లవ్ స్టోరీ సినిమాలోని సారంగధరియా పాట అయినా, శ్యామ్ సింహరాయ్ ప్రణవాలయంలోని పాటలలో సాయి పల్లవి మరపురాని డ్యాన్స్ చేసింది.

గత సినిమాలో ఆమె చెప్పినట్లు ఆమెతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఒకసారి చెప్పడం గమనార్హం. సినిమాలో ప్రతి పాత్రలో నిమగ్నం అయిపోతుంది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటుంది. ఆమె మొదటి చిత్రం ఫిదాలో తన పాత్రకు గాత్రదానం చేయడం ప్రారంభించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే చాలా రోజులుగా ఆమె తెలుగు సినిమాల గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె తమిళ హీరో శివకార్తికేయన్‌ “అమరన్” సినిమాలో నటించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments