వేసవికాలంలో చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. బయట తిరగకుండా చూసుకోవాలి.

కాబట్టి చిన్న పిల్లలు కాటన్ దుస్తులు ధరించి. ఆ సమయంలో ఎక్కువగా బయటికి వెళ్లకుండా చూసుకోవాలి.పిల్లలు పాఠశాలకు వెళ్లేటప్పుడు నీరు ఎక్కువ మోతాదులో తాగాలని చెప్పాలి.

నీటితో పాటు, పిల్లలకి కొబ్బరి నీరు లేదా పుచ్చకాయ రసం వంటి జ్యుసి డ్రింక్స్ ఇవ్వడం మంచిది, ఎందుకంటే అవి పిల్లలను హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.

బార్లీ, జొన్నలు మరియు జావా వంటి ఇతర పానీయాలు కూడా వారికి మంచివి. వేసవి వేడిలో వారికి శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే ద్రవాలను పిల్లలకు ఇవ్వడం వల్ల ఎండాకాలంలో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు.